ముంబైలో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. దాంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరో 9మంది గాయాలతో బయటపడ్డారు. ఇంకా శిథిలాల కింద 30 మందికి పైగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలకు దెబ్బతినడంతోనే.. భవనం కూలిపోయిందని అధికారులు అనుమానిస్తున్నారు.ముంబైలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం




