ముక్కంటి సేవలో పవన్‌ కళ్యాణ్‌

శ్రీకాళహస్తి,మే15(జ‌నం సాక్షి ): తిరుమలలో రెండు రోజులు బస చేసిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మంగళవారం శ్రీకాళహస్తీశ్వరాలయానికి చేరుకున్నారు. ఆలయం తరపున ఈవో భ్రమరాంబ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని సర్వదర్శన క్యూలైన్‌లో వెళ్ళి జ్ఞాన ప్రసునాంబ సమేత శ్రీవాయులింగేశ్వరుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు పవన్‌కు తీర్ధప్రసాదాలు అందజేశారు. పవన్‌ రాకతో అభిమానులు పెద్దయెత్తున ఆలయానికి చేరుకుని కాబోయే సిఎం అంటూ ఆలయ ప్రాంగణంలో నినాదాలు చేశారు. అనంతరం పవన్‌ గుడిమల్లంలోని పరుశురామశ్వేరస్వామి ఆలయం, వికృతమాలలోని శ్రీ సంతాన వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

తాజావార్తలు