బెంగాల్లో క్షీణించిన శాంతిభద్రతలు: సిపిఎం
విజయనగరం,మే15(జనం సాక్షి ): బెంగాల్లో శాంతిభద్రతలు క్షీణించాయని సిపిఎం ఆరోపించింది. పంచాయితీ ఎన్నికల్లో జరిగిన హింసే దీనికి కారణమని వ్యాఖ్యానించింది. అక్కడి టిఎంసి సిపిఎం కార్యకర్తలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, బెంగాల్లో శాంతి చర్యలు కేంద్రం చేపట్టాలని, పంచాయతీ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడిన కేంద్రాల్లో మరలా ఎన్నికల నిర్వహిచాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. ప్రజస్వమ్యాన్ని పునరుద్దరిచాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో చేశారు. మమత ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.