Monday, 2 November 2026

ముగిసిన రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటన

బేగంపేటలో గవర్నర్‌, సిఎం కెసిఆర్‌ గనంగా వీడ్కోలు
హుస్సేన్‌ సాగర్‌లో బుద్దవిగ్రం సందర్శన
హైదరాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కోవింద్‌ రెండురోజుల నగర పర్యటన ముగిసింది. ప్రపంచ తెలుగుమహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొన్న కోవింద్‌, బుధవారం  హుస్సేన్‌సాగర్‌ లోని బుద్ధవిగ్రహాన్ని సందర్శించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్‌ నరసింహన్‌, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ , రాష్ట్ర ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు. ప్రత్యేక బోటులో వీరు బుద్ధ విగ్రహం వద్దకు చేరుకున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో భారీ భద్రతను చేపట్టారు. అంతకుముందు రాష్ట్రపతి సోమాజిగూడలోని రాజ్‌భవన్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు.  ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు హాజరైన రాష్ట్రపతి… రాత్రి రాజ్‌భవన్‌లో బస చేశారు. అనంతరం బుధవారం ఉదయం బుద్ధ విగ్రహాన్ని సందర్శించారు.  సోమాజిగూడలోని రాజ్‌భవన్‌ ఉన్నత పాఠశాల దేశ ప్రథమ పౌరుడి దృష్టిని ఆకర్షిచింది. రాజ్‌భవన్‌ పాఠశాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ ఉదయం సందర్శించారు. పాఠశాల విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్‌ నరసింహన్‌, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ ఆలీ, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు ఉన్నారు. అనంతరం రాష్ట్రపతి అక్కడి నుంచి బయలుదేరి హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధవిగ్రహాన్ని సందర్శించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌ పర్యటన ముగిసింది. ఇవాళ ఉదయం 12 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానాశ్రయంలో రామ్‌నాథ్‌.. ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతికి గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌ వీడ్కోలు పలికారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రామ్‌నాథ్‌ కోవింద్‌.. హైదరాబాద్‌కు వచ్చిన విషయం విదితమే.