ముత్యాల వారి నామకరణ మహోత్సవం,జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

మల్దకల్ జూన్11(జనం సాక్షి) గద్వాల నియోజకవర్గం లోని మల్డకల్ మండలం పరిధిలోని మద్దెలబండ గ్రామంలో తెరాస పార్టీ కార్యకర్త జమ్మన్న లక్ష్మి పుత్రుడు నామకరణ మహోత్సవం మొదటి జన్మదిన వేడుకల్లో శనివారం గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే  సమక్షంలో కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే  చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఇలాంటి పుట్టినరోజులు భవిష్యత్తులో మరెన్నో జరుపుకోవాలి మంచి   అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించడం కోరుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షుడు ఎంపీపీ విజయ్, వైస్ ఎంపీపీ లు వీరన్న, రామకృష్ణ నాయుడు, గట్టు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, తెరాస పార్టీ నాయకులు జంబు రామన్ గౌడ్, నారాయణ, భగీరథ వంశీ, తదితరులు పాల్గొన్నారు.