మున్సిపల్‌ కార్మికుల ఆందోళన

నెల్లూరు,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు గురువారం నెల్లూరు కనకమహల్‌ సెంటర్‌ నుంచి గాంధీ బొమ్మ సెంటర్‌ వరకు అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసనకు వైసిపి ఫ్లోర్‌లీడర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ మద్దతు తెలిపారు. సిఐటియు నాయకులు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ..జిఒ 279 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు గడిచినా దళితులకు వెట్టిచాకిరీ తప్పలేదని చెప్పారు. బడా కాంట్రాక్టర్లకు పనులిచ్చి దళితుల పొట్టకొడుతున్నారని తెలిపారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యల్ని తక్షణమే అధికారులు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రదర్శనలో మున్సిపల్‌ కార్మికులు, సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

—————-

 

 

 

తాజావార్తలు