మున్సిపల్ కార్మికుల పొట్ట కొట్టొద్దు
విజయవాడ,మే26(జనంసాక్షి):మున్సిపల్ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే 279 జీవోను శాశ్వతంగా రద్దు చేయాలని సిఐటియు నగర కార్యదర్శి ఎంవి సుధాకర్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే జీవో 279ను రద్దు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవహరించడం లేదన్నారు. జీవో అమలు జరిగితే కార్మికులు వెట్టి చాకిరికి గురవుతారని, ఇఎస్‌ఐ- పిఎఫ్ , ఉద్యోగ భద్రత అమలు జరిగే పరిస్థితి ఉండదన్నారు. దీనిని రద్దు చేసేవరకు ఉద్యమిస్తూనే ఉంటామని అన్నారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం మున్సిపల్ కార్మికుల హక్కుల్ని కాలరాసే జీవో ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.