– ఎన్నికలపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్,నవంబర్ 20(జనంసాక్షి):మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. అభ్యంతరాలను పరిశీలించకుండా.. ఎన్నికలకు ఎలా వెళతారని పిటిషనర్ తరపు లాయర్ ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించేందుకు డివిజన్ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని ఏఏజీ తెలిపారు. వార్డుల విభజన సక్రమంగా జరగలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. అభ్యంతరాలు పరిష్కరించామని ప్రభుత్వ తరపు లాయర్ వెల్లడించారు. స్టే ఉన్న ఒక్కో మున్సిపాలిటీలపై సింగిల్ బెంచ్ అభ్యంతరాలు స్వీకరించింది. 123 మున్సిపాలిటీలలో 1300 అభ్యంతరాలు వచ్చాయని ఏఏజీ స్పష్టం చేశారు. స్టేలో ఉన్న మున్సిపాలిటీలపై విచారణ గురువారానికి వాయిదా వేసింది.
మున్సిపల్ మరింత లేటు..




