Tuesday, 3 November 2026

మున్సిపల్ ఆర్డీ ఇంట్లో ఏసీబీ సోదాలు

 రాజమండ్రి (తూర్పు గోదావరి) : ఓ ఉద్యోగి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఏపీ  మున్సిపల్ శాఖ ప్రాంతీయ డెరైక్టర్ (ఆర్డీ) రాజేంద్రప్రసాద్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. రాజమండ్రిలోని శ్యామలానగర్‌లోని రాజేంద్రస్రసాద్ నివాసంలో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలోని బృందం మంగళవారం మధ్యాహ్నం సోదాలు నిర్వహించింది. కృష్ణా జిల్లా తిరువూరులో ఏసీబీకి పట్టుబడిన వెంటనే ఆయన నివాసంలో సోదాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే సోదాల్లో భాగంగా ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *