– వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ
హైదరాబాద్, జూన్25(జనం సాక్షి ) : ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో లౌకికవాదం కొనసాగాలంటే.. ముస్లింలంతా ఏకమవ్వాలని, వాళ్లంతా ముస్లింలకే ఓటేయాలని అన్నారు. మహారాష్ట్రలోని బీడ్‌లో జరిగిన ఓ సభలో అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీలోని హపూర్ జిల్లాలో ఆవుల స్మగ్లింగ్ చేస్తున్నాడంటూ ఖాసిమ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను అసద్ ప్రస్తావించారు. ఖాసిమ్ హత్య మనందరినీ మరోసారి ఆలోచించేలా చేస్తున్నది. అతని కోసం కన్నీళ్లు పెట్టకండి. కానీ సంఘటితమవ్వండి. లౌకికవాదం గురించి మాట్లాడేవాళ్లు అతిపెద్ద దోపిడీదారులు. అవకాశవాదులు. వాళ్లు 70 ఏళ్లుగా ముస్లింలను వాడుకున్నారు. మనల్ని భయపెట్టారు, తొక్కేశారు అంటూ అసద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అందుకే ఓ రాజకీయ శక్తిగా ముస్లింలు ఎదగాలని, ముస్లిం అభ్యర్థులే గెలిచేలా ఓట్లేయాలని అసద్ పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇదేనా విూ సబ్‌కా సాథ్, సబ్ కా వికాస్ నినాదానికి అర్థం అంటూ నిలదీశారు.
ముస్లింలు ముస్లింలకే ఓటేయాలి




