విలీనం నాటికే మిగులు రాష్ట్రంగా తెలంగాణ: కెటిఆర్
హైదరాబాద్,నవంబర్23(జనంసాక్షి): ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టును కాంగ్రెస్ పాలకులు 40ఏళ్ల పాటు నిర్మించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. మిషన్‌భగీరథ ప్రాజెక్టును టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడేళ్లలోనే దాదాపు పూర్తయ్యింది. తాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తాజ్‌డెక్కన్ ¬టల్‌లో నిర్వహించిన పారిశ్రామిక వేత్తల సదస్సులో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 1956లో ఆంధ్ర-తెలంగాణ కలిసే నాటికే హైదరాబాద్ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా ఉంది. ఏ ప్రాంత ఆదాయం ఆ ప్రాంతంపైనే ఖర్చు చేయాలనేది పెద్ద మనుషుల
ఒప్పందంలోని ప్రధాన అంశం. పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలు ఉల్లంఘన తర్వాతే తెలంగాణలో ఉద్యమం మొదలైంది. 1968లో తెలంగాణలో మిగులు ఆదాయం ఉందని విఠల్ కమిషన్ వెల్లడించిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోపే విద్యుత్ సమస్య తీర్చారని పారిశ్రామిక సమాఖ్య అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమలు మూతపడే స్థితి నుంచి.. విస్తరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం
ప్రోత్సహించింది. పారిశ్రామిక ఇబ్బందులు తెలుసుకుని.. అభివృద్ధికి కృషి చేశారు. పారిశ్రామిక ప్రగతికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త విధానాలు తీసుకువచ్చింది. మూతపడే స్థితిలోని చిన్న పరిశ్రమలకు చేయూతనిచ్చారని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు.




