మూడేళ్ళల్లో గంగానది ప్రక్షాళన మంత్రి ఉమాభారతి అలహాబాద్ డిసెంబర్,14 (జనంసాక్షి) : పవిత్ర గంగానది ప్రక్షాళనకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలోగా గంగానది ప్రక్షాళన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ ఆమె గంగానదిని పరిశీలించిన అనంతరం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. గంగానది రోజురోజుకు కలుషితం కావడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నది ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్‌లో ప్రవహిస్తున్నందున ఈ బృహత్కార్యంలో ఆ రాష్ట్ర సర్కారు కూడా కీలక పాత్ర
పోషించాల్సి ఉంటుందని అన్నారు. ఈమేరకు యూపీ ప్రభుత్వంతో ఈనెల 20న చర్చలు జరుపనున్నట్టు తెలిపారు. గంగానదిని మూడు దశల్లో ప్రక్షాళన చేయనున్నట్టు కేంద్ర జలవనరుల శాఖ సుప్రీంకోర్టులో అఫిడెవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
మూడేళ్ళల్లో గంగానది ప్రక్షాళన మంత్రి ఉమాభారతి




