Tuesday, 3 November 2026

మూడో దశ పోలింగ్‌ ప్రశాంతం

4

ఝార్ఖండ్‌లో 61, జమ్మూలో 58 శాతం పోలింగ్‌

శ్రీనగర్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : జమ్మూకశ్మీర్‌, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. అక్కడక్కడ చెదురుమొదురు ఘటనలు జరిగాయి. ఝార్ఖండ్‌లోని 17 నియోజకవర్గాల్లో 61 శాతం, జమ్మూకశ్మీర్‌లోని 16 నియోజకవర్గాల్లో 58 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారత క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని, ఆయన భార్య సాక్షి ఝార్ఖండ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జమ్ము కశ్మీర్‌లోని 16 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది.. 1781 పోలింగ్‌ కేంద్రాల ద్వారా 13,69,579 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.. కశ్మీర్‌ లోయలో శుక్రవారం జరిగిన ఘటనలో 11 మంది భద్రతా సిబ్బందితో సహా 21మంది కన్నుమూయడంతో ఎన్నికలు జరిగే బారాముల్లా, బద్‌గాం, పుల్వామా జిల్లాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఝార్ఖండ్‌లోని 17 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.. ఎనిమిది జిల్లాల్లో జరగిన ఎన్నికల్లో 14 చోట్ల సాయంత్రం 3 గంటలకు పోలింగ్‌ ముగిసింది. రాంచీ, హటియా, కాంకే నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించారు.. హటియాలో రికార్డు స్థాయిలో 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఝార్ఖండ్‌లోని కెందువా పహారీ ప్రాంతంలో నక్సలైట్లు, భద్రత దళాల మధ్య ఎదుకాల్పులు జరిగినట్లు సమాచారం. దీంతో అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *