Tuesday, 3 November 2026

మూడో సంతానం వార్తను నిర్ధారించిన షారుఖ్‌

ముంబయి: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ తనకు మూడో సంతానం కలిగిందన్న విషయాన్ని నిర్ధారించారు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడి చేయడానికి అయన ఇష్టపడలేదు. ‘ఇది అనందం, విషాదాల సమ్మేళనం, వూహాగానాలు వద్దు. నా బిడ్డ విషయంలో అత్యుత్సాహంతో పరిశోధన చేయాలనుకునే వారందరూ కాస్త సంయమనం పాటించాల్సిన సమయం. నేను తప్పకుండా సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు మీతో పంచుకుంటాను’ అని షారుఖ్‌ పత్రికలవారికి తెలిపారు. గత కొంతకాలంగా షారుఖ్‌ దంపతులు అద్దెగర్భం ద్వారా బిడ్డను పొందుతున్నారని, లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారని పలు రకాల వార్తలు వెలువడ్డాయి. వీటన్నిటి గురించి షారుఖ్‌ దంపతులు ఇంతవరకు పెదవి విప్పని సంగతి తెలిసిందే. మేలో బిడ్డ పుట్టిన విషయం, షారుఖ్‌ దంపతులు బిడ్డ జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసిన విషయం అధికార వర్గాల ద్వారా వెల్లడైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *