Monday, 2 November 2026

మూసీలో కొట్టుకుపోయిన యువకుడు

3brk64aశంకరపల్లి: రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ఫతేపురం వద్ద మూసీనది పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరదనీరు వంతెనపై నుంచి రెండు అడుగుల మేర ప్రవహిస్తోంది. దీంతో శంకరపల్లి- చేవెళ్ల ప్రధాన రాహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనంపై వాగు దాటేందుకు ప్రయత్నించిన ఓ యవకుడు అదుపుతప్పి మూసీలో కొట్టుకుపోయాడు. కొద్ది దూరం కొట్టుకుపోయి ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ద్విచక్రవాహనం మూసీలోనే కొట్టుకుపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *