మెకానిక్ షెడ్ ను ప్రారంభిస్తున్న సర్పంచ్ కుండె మల్లయ్య ద్విచక్ర వాహన మెకానిక్ షెడ్ ప్రారంభం…!

ద్విచక్ర వాహన మెకానిక్ షెడ్ ను చెన్నారావుపేట సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, చెన్నారావుపేట సర్పంచ్ కుండె మల్లయ్య ప్రారంభించారు. సోమవారం చెన్నారావుపేట మండల కేంద్రంలో నూతన ఏర్పాటు చేసిన గణేష్ టు వీలర్ మెకానిక్ షెడ్ ను ప్రారంభోత్సవం చేశారు. ప్రజలు ఈ మెకానిక్ షెడ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి జున్ను తుల రామ్ రెడ్డి, కోనాపురం సర్పంచ్ వెల్దె సుజాత సారంగం, మాజీ ఎంపీటీసీ మాదాసి కుమారస్వామి, సొసైటీ డైరెక్టర్ అనుముల రవి, స్వామి, వార్డ్ మెంబర్స్ పురం మంజుల మల్లయ్య, రాంబాబు, రంజిత్, రవీందర్, నవీన్, లిట్టు, రాకేష్, కళ్యాణ్, నగేష్, అనిల్, విక్రమ్, ఆజాద్, ప్రొప్రైటర్ చిలువేరు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.