Friday, 6 November 2026

మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు: ముగ్గురు మృతి

లుంబిని పార్క్‌ వద్ద హుస్సేన్‌ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు

హైదరాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): సికింద్రాబాద్‌ మెట్టుగూడ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్థరాత్రి అతివేగంతో వచ్చిన బైకు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతదేహాలు పోలీసులు గాంధీ మార్చురీకి తరలించారు. మృతులు సూర్యాపేటకు చెందిన ఉదయ్‌రెడ్డి, పృథ్వీ, ఉదయ్‌గా పోలీసులు గుర్తించారు. వేగంగా వచ్చిన వీరి కారు పిల్లర్‌ను ఢీకొన్న ఘటనలో వీరు మృత్యువాత పడ్డారు. ఇదిలావుంటే ప్రమాదవాశాత్తు అదుపుతప్పిన కారు హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లిన ఘటన లుంబినీ పార్క్‌ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. వేగంతో వచ్చిన కారు మలుపు వద్ద యూటర్న్‌ తీసుకుంటున్న సమయంలో అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి ఎక్కింది. అక్కడితో అగకుండా ఫుట్‌పాత్‌ గ్రిల్స్‌ ధ్వంసం చేసుకుంటూ హుస్సేన్‌సాగర్‌లో పల్టీ కొట్టింది. కారులో ఉన్న నలుగురు ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. హుస్సేన్‌సాగర్‌లో పడిన కారును క్రేన్‌ సాయంతో పోలీసులు బయటకు తీశారు. ఈ ప్రమాదం జరగడానికి నిద్రమత్తా లేక మద్యం మత్తా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.