మెదక్‌ కలెక్టర్‌గా హన్మంతరావు బాధ్యతల స్వీకరణ

ఏడుపాయలను సందర్శించి తొలుత పూజలు
మెదక్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): మెదక్‌ జిల్లా నూతన కలెక్టర్‌గా హన్మంతరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ కంటే ముందు ఏడుపాయల దుర్గామాతను హన్మంతరావు దర్శించుకున్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హన్మంతరావుకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట కలెక్టర్‌గా భారతి ¬ళికెరీ ఆదివారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం పలువురు కలెక్టర్లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ముగ్గురికి స్థానచలనం కల్పించడంతో పాటు మరో ఇద్దరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. మెదక్‌కు హన్మంతరావు, సంగారెడ్డికి వెంకట్రామిరెడ్డి, సిద్దిపేటకు భారతీ ¬ళికెరీని బదిలీ చేసింది. పెద్దపల్లి జిల్లా అదనపు బాధ్యతలు కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంకకు, మంచిర్యాల అదనపు బాధ్యతలు ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌కు అప్పగించింది.