Tuesday, 3 November 2026

మేక్‌ ఇన్‌ ఇండియా వారోత్సవకార్యమ్రంలో భారీ అగ్నిప్రమాదం

C

-వీఐపీలకు తప్పిను ముప్పు

ముంబై ,ఫిబ్రవరి 14(జనంసాక్షి):భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ముంబైలో మేక్‌ ఇన్‌ ఇండియా వారోత్సవ కార్యక్రమంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వేదిక మొత్తం మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో ఎవరైనా మృతి చెందారా ? ఎవరైనా గాయపడ్డారా ? అనేది తెలియాల్సి ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు రద్దు చేశారు. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆదివారం ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, సీఎం ఫడ్నవీస్‌, బాలీవుడ్‌ నటుడు, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, నటుడు అవిూర్‌ ఖాన్‌, నటి హేమామాలిని తదితర ప్రముఖులు హాజరయ్యారు. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా వేదికపై మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు దట్టంగా వ్యాపించాయి. వేదికను కట్టెలు..దుస్తులు వాడడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు. బిగ్‌ బికి సవిూపంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ప్రముఖులను, రాజకీయ నేతలు, సినీ నటులను క్షేమంగా బయటకు తరలించారు.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జరుగుతున్న మేక్‌ ఇన్‌ ఇండియా వారోత్సవాల కార్యక్రమంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాంస్కృతిక కార్యక్రమాల వేదిక వద్ద భారీగా మంటలు అంటుకున్నాయి. వేదికపై కళాకారులు ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిమిషాల్లోనే వేదిక పూర్తిగా దగ్ధమై కుప్పకూలింది. ప్రాణభయంతో కళాకారులు, వీక్షకులు పరుగులు తీశారు. ఘటనాస్థలికి చేరుకున్న 14 అగ్నిమాపక శకటాలు, 10 నీటి ట్యాంకర్లతో అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, ఆ రాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, బాలీవుడ్‌ నటులు అమితాబ్‌, ఆవిూర్‌ఖాన్‌, ఎంపీ హేమమాలిని తదితరులు అక్కడే ఉన్నారు. వీరిని పోలీసులు సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.

వీవీఐపీలకు తప్పిన ముప్పు

ముంబై: మేక్‌ ఇన్‌ ఇండియా వారోత్సవాల కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ముంబై నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’లో వేదిక వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో వేదికకు ఓ వైపు చిన్నగా మంటలు అంటుకున్నాయి. అనంతరం కొన్ని నిమిషాల్లోనే వేదిక పూర్తిగా కాలి దగ్ధమైంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రే, బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచన్‌, ఆవిూర్‌ ఖాన్‌, హేమ మాలినీ, తదితర ప్రముఖులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే యత్నం చేస్తుంది. కాగా, నిన్న ప్రధాని నరేంద్ర మోదీ మేక్‌ ఇన్‌ ఇండియా వారోత్సవాలను ముంబై నగరంలో ప్రారంభించిన విషయం విదితమే.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *