Tuesday, 3 November 2026

మేడారం జాతరకు స్పెషల్ బస్సులు

4zgeebisసమ్మక్క-సారక్క జాతరకు ఆర్టీసి స్పెషల్ బస్సులు రెడీ చేస్తోంది. జాతర రష్ దృష్టిలో పెట్టుకొని పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడపనుంది. జాతర సీజన్ ను క్యాష్ చేసుకోడానికి సిద్ధమైంది. జాతరకు వెళ్లే భక్తులు www.tsrtconline.in వెబ్ సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. ఎంజీబీఎస్, ఉప్పల్ నుంచి గంటకో బస్సు నడపుతున్నారు.  సిటీలో మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా బసెస్ రన్ చేస్తున్నారు. స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీల మోత మాత్రం తప్పడం లేదు. జాతరకు వెళ్లే బస్సుల్లో చార్జీల వివరాలను కూడా ఆర్టీసీ ప్రకటించింది. ఏసీ బస్సులో వెళ్లే పెద్దలకు 552 రూపాయలు, పిల్లలకు 432 రూపాయలు నిర్ణయించారు. సూపర్ లగ్జరీ బస్సులో వెళ్లే పెద్దలకు 447, పిల్లలకు 247 రూపాయలు డిసైడ్ చేశారు. ఎక్స్ ప్రెస్ లో పెద్దలకు 337, చిన్నపిల్లలకు 187 రూపాయలుగా  నిర్ణయించారు. మేడారం జాతరకు వేసిన ప్రత్యేక బస్సులను భక్తులు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *