Saturday, 7 November 2026

మేడ్చెల్‌లో సోనియా సభకు భారీ భద్రత

హైదరాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): మేడ్చల్‌లో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ భారీ బహిరంగ సభ కారణంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బాలానగర్‌ డీసీపీ పద్మజ పర్యవేక్షణలో సుమారు 1000 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. సభాప్రాంగణం లోపల భద్రతను ఎస్పీజీ భద్రతా అధికారులు పర్యవేక్షించారు. వేదికపై మొత్తం 3 వేదికలు ఏర్పాటు చేశారు. అత్యంత ప్రముఖులకు ప్రత్యేక రాకపోకలకు ప్రవేశం ఏర్పాటు చేశారు. విూడియా, ప్రముఖులు, కళాకారులకు ప్రత్యేక ప్రవేశం ఉంది. ఇవి కాకుండా మరో 20 ప్రవేశద్వారాలను జనం కోసం ఏర్పాటు చేశారు. ఒక డీసీపీ, ముగ్గురు అదనపు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 20 మంది ఇన్స్పెక్టర్లు, వంద మంది సబ్‌ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేవారికి తనిఖీలు నిర్వహించి అనుమతిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రముఖులు ఈ సభకు హాజరవుతుండడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు డీసీపీ పద్మజ తెలిపారు. మేడ్చల్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభా వేదిక వద్దకు సోనియా గాంధీ, రాహుల్‌ చేరుకునున్నారు.