ఖమ్మం : ఖమ్మం జిల్లా డీఈఓ ఆఫీస్ ఎదుట ముంపు మండలాల ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. తమను తెలంగాణలోనే కొనసాగించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రాకు పంపొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ధర్నాలో సుమారు 200 మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం(పట్టణం మినహా)తో పాటు బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలను ఆంధ్రాలో కలిపారు.




