Wednesday, 4 November 2026

వజ్రాల‌తో తయారు చేసిన బూట్లు

 

Surat designs splendid diamond shoes

గుజరాత్ : ఇప్పటి వరకు లెదర్, కొన్ని రకాలైన తోలుతో మాత్రమే చెప్పులు, బూట్లు తయారు చేయడమే చూశాం! కానీ ఏకంగా డైమండ్‌లతో బూట్లు తయారు చేశాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లోని అత్వాలైన్స్‌లో ఒక జత బూట్లను 12,000 డైమండ్లతో బూట్లను తయారు చేశాడు ఓ క్రాఫ్ట్స్‌మెన్. ఈ ఒక్క జత బూట్లను తయారు చేసేందుకు చాలా ఎక్కువ ఖర్చు అయిందని క్రాఫ్ట్స్‌మెన్ దిలీప్ షా తెలిపాడు. ఒక్క బూటుకు 6,000 డైమండ్లు ఉపయోగించామని పేర్కొన్నాడు.

ఈ డైమండ్ బూట్లను తయారు చేయడానికి రెండు నెలల సమయం పట్టిందన్నాడు. డైమండ్లు కలిగి ఉన్న బూట్లను తయారు చేయాలని దుబాయ్‌కు చెందిన ఓ వ్యక్తి ఆర్డర్ ఇచ్చారని చెప్పాడు. అయితే కొద్ది రోజుల కిత్రమే వికాస్ జునేజా అనే క్రాఫ్ట్స్‌మెన్ షూ లేస్ క్లిప్‌ను డైమండ్లతో తయారు చేశాడు. ఈ క్లిప్ తయారీ కోసం 300 డైమండ్లు ఉపయోగించాడు. మూడు వందల డైమండ్స్ ఖరీదు రూ. 2 లక్షలు. భారత్‌లో వజ్రాలతో కూడిన వస్తువులు తయారీకి డిమాండ్ పెరుగుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *