షాద్‌నగర్,నవంబర్21(జనంసాక్షి): ఫరూఖ్ నగర్ మండలంలోని మొగలిగిద్దలో బుధవారం ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన తెరాస అభ్యర్థి అంజయ్యయాదవ్‌ను గ్రామస్థులు అడ్డుకొని గ్రామంలోని సమస్యలను పరిష్కరించలేదంటూ వివాదానికి దిగారు. ఈ క్రమంలో కార్యకర్తలకు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. దీంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టి గ్రామంలో పహారా నిర్వహించారు.




