మోడల్ మార్కెట్‌గా ఆదోని యార్డు ఎంపిక
కర్నూలు,మే29(జనం సాక్షి ): ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డు కర్నూలు జిల్లాలోనే మోడల్యార్డుగా ఎంపికైనట్లు మార్కెటింగ్‌శాఖ సంయుక్త సంచాలకులు సుధాకర్ తెలిపారు. మంగళవారం స్థానిక యార్డులో పర్యటించిన ఆయన రైతులకు అందుతున్న వసతి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సీమ జిల్లాల్లోనే ఆదోని యార్డు వ్యాపారరంగంలో పేరు గాంచిందన్నారు. ఏటా రూ. 2వేల కోట్ల వ్యాపారాలు ఈ యార్డులో జరుగుతున్నాయని చెప్పారు. దీంతో ప్రభుత్వం ఆదోనియార్డును మోడల్యార్డుగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేసిందన్నారు. ఫలితంగా నిధులు పెరగడంతో పాటు రైతులకు, వ్యాపారులకు అత్యాధునిక సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వీరి వెంట మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ చౌదరి, కార్యదర్శి రామారావు, డీఈ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.