Wednesday, 4 November 2026

మోడీని నిలదీసే దమ్ము కేసీఆర్‌కు లేదు

– విభజన సమస్యలపై కేసీఆర్‌ ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా?
– 14మంది ఎంపీలు ఏం చేస్తున్నారు?
– రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్‌ స్టాండ్‌
– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ
హైదరాబాద్‌, జులై25(జ‌నంసాక్షి) : విభజన సమస్యలపై కేసీఆర్‌ ఏనాడైనా కేంద్రాన్ని నిలదీశారా అని, మోడీని నిలదీసే దమ్ము కేసీఆర్‌కు లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు ప్రత్యేక ¬దాపై కాంగ్రెస్‌ వైఖరి ఏంటని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని షబ్బీర్‌అలీ అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కాంగ్రెస్‌ వైఖరిని ప్రశ్నించడమేంటని ప్రశ్నించారు. విభజన సమస్యలపై సీఎం కేసీఆర్‌ ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ తీసుకున్న యూటర్న్‌ను ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల కోసం ప్రజల్లో సెంటిమెంట్‌ రగిల్చాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చామని గొప్పలు చెప్పిన కేసీఆర్‌ .. ఇప్పుడు 14 మంది ఎంపీలతో విభజన చట్టంలో ఇచ్చిన హావిూలను ఎందుకు సాధించలేక పోయారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ 14 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్లపై టీఆర్‌ఎస్‌ ఏం చేస్తోందని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ ఊసరవెల్లిలా రంగులు మారుస్తోందని, కేసీఆర్‌కు మోడీపై గట్టిగా మాట్లాడే దమ్ము లేదని, టీఆర్‌ఎస్‌ ఎంపీలు దద్దమ్మలు అని అలీ విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని, రెండు రాష్ట్రాలకూ విభజన హావిూలు అమలు చేయాలన్నదే తమ స్టాండ్‌ అని అన్నారు. పార్టీ ఫిరాయించిన తలసానికి తమ స్టాండ్‌ ఏంటో అడిగే నైతికత లేదని అన్నారు. తలసాని తెలంగాణ ద్రోహి అని, ఎన్నికల్లో ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని అలీ అన్నారు. పీసీసీలో ఇప్పట్లో ఎలాంటి మార్పుడు ఉండే అవకాశం లేదని షబ్బీర్‌ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడమే తమ లక్ష్యమని, అందుకు ప్రతి ఒక్కరం ఐక్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.