రాజన్న సిరిసిల్ల బ్యూరో. మే 2. (జనంసాక్షి). ప్రధాని మోడీ కర్ణాటకకు ప్రధాన లేక దేశానికి ప్రధానమంత్రి అని ఐటి మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూటిగా ప్రశ్నించారు. మంగళవారం సిరిసిల్లలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ప్రతిరోజు అర లీటర్ పాలు, మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటూ ఎన్నికల మనిపేస్తో లో తెలపడంపై విస్మయం వ్యక్తం చేశారు. మిగిలిన రాష్ట్రాల ప్రజలు ఏం పాపం చేశారని విసుర్లు విసిరారు. దేశ ప్రజలందరిని సమానంగా చూడవలసిన ప్రధాని మోడీ కర్ణాటక రాష్ట్రానికి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తూ మాట్లాడడం దేశ ప్రజలు గమనించాలని కోరారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.




