మౌలాలీలో ఫ్రెష్ లైవ్ ఫిష్ మార్కెట్ ఓపెన్ చేసిన స్థానిక కార్పొరేటర్లు

హైదరాబాద్  లోని అన్ని ప్రాంతాల వారిని అందుబాటులో ఉండేలా
స్థానిక మౌలాలి ఏరియాలో ఫ్రెష్ లైవ్ ఫిష్ మార్కెట్ ఓపెన్ చేశారు. బన్సీలాల్ యాజమాన్యంలో లోయల్ అగ్రి ఫామ్ పేరుతో మౌలాలి కృష్ణా నగర్ స్ట్రీట్ నెంబర్ 4 లో ఏర్పాటు చేసిన ఈ మార్కెట్ ను మౌలాలి కార్పొరేటర్ ప్రభుదాస్, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. రిబ్బన్ కటింగ్ చేసిన కార్పొరేటర్లు యజమాని బన్సీలాల్‌కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మౌలాలి మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, TUWJ నాయకులు టీ. మల్కయ్య, ప్రముఖ వ్యాపారవేత్తలు VSN రెడ్డి, కానాల సీతారామిరెడ్డి, బొద్దుల సునీల్, కే రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిష్ మార్కెట్ యజమాని బన్సీలాల్ మాట్లాడుతూ.. దేశంలోని పలు ప్రాంతాల నుంచి తెప్పించిన దేశీయ ఫిష్‌ని లైవ్‌గా హైదరాబాద్ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ఫిష్ మార్కెట్ ఆలోచన పుట్టిందని, ఈ ఫిష్ మార్కెట్ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు.