మ్యాగీ మళ్లీ వస్తదట!

lul1kjrnఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ మ్యాగీపై బొంబాయి హైకోర్టు నిషేధం ఎత్తివేయటంతో ఈ ఏడాది చివరి నాటికల్లా మళ్లీ దీన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు నెస్లే ఇండియా సన్నాహాలు చేస్తోంది. చట్టపరమైన నిబంధనలు అందుకున్న అనంతరం సాధ్యమైనంత త్వరలో మ్యాగీని మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు తెలిపింది. నూడుల్స్‌లో సీసం శాతం మోతాదుకు మించి ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడి కావటంతో ఈ ఏడాది జూన్‌లో 450 కోట్ల రూపాయల విలువైన 30 వేల టన్నుల మ్యాగీ నూడుల్స్‌ను నెస్లే ఇండియా నాశనం చేసిన సంగతి విదితమే. కాగా పంజాబ్‌, హైదరాబాద్‌, జైపూర్‌ల్లోని మూడు ఇండిపెండెంట్‌ లేబొరేటరీలు నిర్వహించిన పరీక్షల్లో సీసం శాతం తగిన మోతాదులో ఉన్నట్లు వెల్లడికావటంతో బాంబే హైకోర్టు మ్యాగీపై నిషేధం ఎత్తివేసింది.