హైదరాబాద్,జూన్15(జనం సాక్షి ): ప్రైవేట్ పాటలకి మ్యూజిక్ అందించిన వర్ధమాన మ్యూజిక్ డైరెక్టర్ అనురాగ్ వినీల్ ఆత్మహత్య ప్రస్తుతం టాలీవుడ్ లో కలకలం రేపుతుంది. ఐదు రోజుల క్రితం వినీల్ చనిపోయాడని తెలుస్తుండగా ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 9న కేసు నమోదు చేసుకున్న హయత్ నగర్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు ప్రైవేట్ పాటలకు మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ అనురాగ్ వినీల్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. నాగోల్‌లోని మమతానగర్‌లో నివాసముంటున్న అనురాగ్ వినీల్ గత కొంతకాలంగా డ్రగ్స్‌కు బానిసైనట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు చుట్టుప్రక్కల వారు. ఆయనను కొందరు వేధింపులకు గురి చేస్తుండటంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం. కాగా వినీల్ ఆత్మహత్య విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్‌గా వినీల్ చేసిన పలు ప్రైవేట్ ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈయన కంపోజ్ చేసిన పాటల్లో నీలాకాశం, రిపబ్లిక్ డే స్పెషల్‌గా వందేమాతరం అనే పాట, ఓ చెలియా.. అనే పాటలు ప్రజాదారణ పొందాయి. నాగోల్ లోని మమతా నగర్ లో ఉంటున్న అనురాగ్ వినీల్ (నాని) జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. అనురాగ్ డ్రగ్స్ కి బానిస కావడం, ఈ మేరకు చుట్టు పక్కల వారు వేధించిన కారణంగా తన నివాసంలోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని అంటున్నారు. నీలాకాశం, రిపబ్లిక్ డే స్పెషల్ గా వందేమాతరం అనే పాట, ఓ చెలియా వంటి ఆల్బమ్స్ అనురాగ్ కంపోజీషన్ లో రూపొందగా, ఇవి ప్రజాదరణ పొందాయి. కుమారుడు లేరనే వార్తతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. త్వరలో అనురాగ్ ఆత్మహత్యకు గల కారణాలు బయటకు వస్తాయని పోలీసులు అంటున్నారు.




