Friday, 6 November 2026

హోంగార్డులకు బాబు తీపి కబురు

దినసరి వేతనం రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటన

అమరావతి,జూన్‌15(జ‌నం సాక్షి ): రాష్ట్రంలోని హోంగార్డులకు సిఎం చంద్రబాబు తీయని కబురు అందించారు. వారి దినసరి వేతనాన్ని డబుల్‌ చేస్తున్నట్‌ఉ ప్రకటించారు. ప్రస్తుతం దినసరి వేతనం రూ.300 నుంచి రూ.600రూపాయలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అమరావతి ప్రజాదర్బార్‌ హాల్‌లో రాష్ట్ర ¬గార్డులు సీఎం చంద్రబాబును కలిసి తమ సమస్యల్ని విన్నవించుకున్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం.. వేతనాలు రెట్టింపు చేయడంతోపాటు మెటర్నిటీ సెలవులను మూడు నెలలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ¬ంగార్డు మృతిచెందితే దహన సంస్కారాలకు రూ. 10 వేలు మంజూరు చేస్తామన్నారు. ఎన్టీఆర్‌ వైద్య సేవలో రెండున్నరలక్షల రూపాయల మేర వైద్య సాయంతో పాటు గృహనిర్మాణ పథకంలో లబ్దిచేకూర్చే అంశాన్ని అధికారులతో చర్చించి నిర్ణయిస్తామని సీఎం వెల్లడించారు.

అజ్మీరా దర్గాకు చాదర్‌

అజ్మీర్‌ దర్గాకు చాదర్‌ను పంపాలని సీఎం నిర్ణయించారు. వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ జలీల్‌ఖాన్‌కు చాదర్‌ను అందజేశారు. విజయవాడ నుంచి అజ్మీర్‌ దర్గా యాత్రకు 150మంది ముస్లిం సోదరులను ప్రభుత్వం పంపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజ్మీర్‌ దర్గాలో చాదర్‌ను సమర్పించనున్నారు.