టైటిల్; కల్లూరిని రాంచంద్రా రెడ్డిని పరామర్శించిన ఎం. ల్. ఏ. సీతక్క.
కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి ప్రథమ పుత్రుడు శ్రీపతి రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకొన్న ములుగు ఎమ్మేల్యే సీతక్క మంగళవారం తుర్కపల్లి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో గల కల్లూరి రాంచంద్రా రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని ఓదార్చారు. శ్రీపతి రెడ్డి మరణం పట్ల తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శ్రీపతి రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు ధైర్యంగా ఉండాలని మనోధైర్యం కల్పించారు.కార్యక్రమంలో, టి పీ సీ సీ అధికార ప్రతినిదులు పున్న కైలాష్ నేత,రవళి కుచన, తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్,వెంకటా పూర్, మోతీరాంతండా సర్పంచ్ లు, కల్లూరి ప్రభాకర్ రెడ్డి,బానోత్ బిచ్చు నాయక్,నాయకులు,రాజేష్ నాయక్,సతీష్ బట్,ఇంజ నరేష్,గడ్డమీది యాదగిరి, మడిగే వెంకట స్వామి, అశోక్,కోట సురేష్,బండారి శ్రీను,బూక్యా రమేష్ నాయక్,పిడుగు రమేష్, వల్లేపు రమేశ్,మహేందర్ రెడ్డి, అంజి రెడ్డి,సాయి నిఖిల్ గౌడ్,రాజు, మాధవ్,హరీష్, తదితులున్నారు.




