శాంతిఖని గనిలో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఇంప్లిమెంటర్ మరియు మానిటర్ అవగాహన సదస్సు.
బెల్లంపల్లి, నవంబర్ 8, (జనంసాక్షి )
సింగరేణి కార్మికులకు మంగళవారం రోజున శాంతిఖని గనిలో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలు మరియు పర్యవేక్షణ యొక్క పాత్రను క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమం కోసం కార్పొరేట్ జీఎం గురువయ్య ఆదేశాల మేరకు గని ఆవరణలో రక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిధిగా విచ్చేసిన బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం జాన్ ఆనంద్, మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్, ఏరియా రక్షణ అధికారి ఓదెలు, ఏజెంట్ కె.రాజేందర్, ఎస్ ఓ ఎం ఎస్ ఎమ్ టీ సి ఇంచార్జి విజయ్ కుమార్, గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, రక్షణ అధికారి పి.రాజు, పిట్ ఇంజనీర్ రాంబాబు, మరియు పిట్ సెక్రెటరీలు దాసరి శ్రీనివాస్, దాసరి తిరుపతి గౌడ్ పాల్గొని ఈ యొక్క సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలు మరియు పర్యవేక్షణ మీద తమ విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు . ఈ కార్యక్రమంలో గని అధికారులు, సూపర్ వైజర్లు మరియు టెక్నీషియన్లు పాల్గొన్నారు.