Tuesday, 3 November 2026

యాదాద్రికి బయలుదేరిన బండి

ఖైరతాబాద్‌ ఆమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఉప్పల్‌లో ఘనంగగా స్వాగతం పలికిన ప్రభాకర్‌
ఘట్‌కేసర్‌లో కేంద్రమంత్రి షెకావత్‌కు స్వాగతం
అందరూ కలసి యాదాద్రికి చేరుకుని ప్రత్యేక పూజలు
హైదరాబాద్‌,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): బీజేపీ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు అంతా సిద్ధమైన వేళ బండి సంజయ్యాదాద్రికి బయలుదేరారు. మంగళవారం నుంచి మూడో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. ఈక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ నాగుల పంచమి సందర్భంగా ఖైరతాబాద్‌ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. యాదగిరిగుట్టకు బయల్దేరారు. ఉదయం ఖైరతాబాద్‌ అమ్మవారి టెంపుల్‌ లో పూజలు చేసిన సంజయ్‌.. పార్టీ కార్యాలయం నుంచి యాదాద్రికి చేరుకున్నారు. దారి మధ్యలో ఉప్పల్‌లో సంజయ్‌కు స్థానిక నాయకులు భారీ స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే ఫ్రభాకర్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వాగతం చెప్పారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెఖావత్‌ కూడా పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. ఘట్‌కేసర్‌ లో కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెఖావత్‌ ను బండి సంజయ్‌ స్వాగతం పలికారు. ఘట్‌ కేసర్‌ పార్టీ ఆఫీసులో కేంద్రమంత్రిని సంజయ్‌ సన్మానించారు. అక్కడి నుంచి కేంద్రమంత్రితో కలిసి యాదగిరిగుట్టకు బయలుదేరారు. ఈ క్రమంలోనే బీబీనగర్‌, భువనగిరిలో బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు చేరుకున్న బండి సంజయ్‌.. శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శంచుకొని ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం యాదగిరిగుట్ట పట్టణ శివారులోని వంగపల్లి గ్రామంలో బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభ తర్వాత జెండా ఊపి పాదయాత్రను పారంభిస్తారు. తొలిరోజు యాదగిరిగుట్ట నుంచి ప్రారంభించి.. గంగసానిపల్లి, ముత్తిరెడ్డి గూడెం, బస్వాపూర్‌ వరకు యాత్ర సాగనుంది. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో.. మొదటి రోజు 10.5 కిలోవిూటర్ల మేర యాత్ర ఉంటుంది. బస్వాపూర్‌ సవిూపంలో మొదటిరోజు రాత్రి సంజయ్‌ బస చేస్తారు. రేపు హుస్సేన్‌ బాద్‌ రూరల్‌, భువనగిరి టౌన్‌, టీచర్స్‌ కాలనీల్లో… ఆగస్ట్‌ 4న గొల్లగూడెం, మగ్దూంపల్లి, పెద్దపలుగు తండా, చిన్న రావుల్పల్లి, గుర్రాలదండిలో 11.7కి.విూ. మేర యాత్ర ఉంటుంది. ఆగస్ట్‌ 7వ తేదీ వరకు మొత్తం భువనగిరి నియోజకవర్గంలోనే పాదయాత్ర సాగనుంది. ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గం లోకి పాదయాత్ర ఎంటర్‌ అవుతుంది. మొత్తం 24రోజుల పాటు 328 కిలోవిూటర్లు.. మూడో విడత ప్రజా సంగ్రామయాత్ర సాగనుంది. 5జిల్లాలు, 12 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్‌ అయ్యేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. ఈ నెల 26న హన్మకొండలోని ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌ లో బహిరంగ సభతో మూడో విడత యాత్ర ముగుస్తుంది. ముగింపు సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, లేదా జాతీయ కీలకనేతను ముఖ్య అతిథిగా తీసుకువచ్చే ఏర్పాట్లలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఉంది.