భక్తులను ఆకట్టుకుంటున్న రుచి,శుచి
యాదాద్రి భువనగిరి,జూలై24(జనంసాక్షి): రాష్ట్రంలోని అన్ని ఆలయాల కన్నా యాదాద్రి లడ్డూ ఎంతో శ్రేష్ఠమైనదిగా ఐఎస్‌వో బృందం గుర్తించింది. ఇక్కడి లడ్డు రుచి,శుచిలో మిన్నగా ఉంటోంది. భక్తులు కూడా లడ్డూను తీసుకుని వెల్లడానికి ఇష్టపడుతుంటారు. తాజాగా ఐఎస్‌వో రావడంతో ఇప్పుడు ప్రతి భక్తుడు లడ్డూల కోసం ఆరా తీస్తున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదాల్లో ముఖ్యమైన లడ్డూ, పులి¬ర, వడ, దద్దోజనం తదితర ప్రసాదాలు నాణ్యతతో ఉన్నవిగా ఐఎస్‌వో బృందం తనిఖీల్లో రుజువైనది.దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా యాదాద్రి ఆలయానికి ఐఎస్‌వో సర్టిఫికెట్ రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఐఎస్‌వో సర్టిఫికెట్ దక్కించుకున్నందుకు వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, యాదాద్రి ఆలయ ఈవో ఎన్.గీతలను సీఎం కేసీఆర్ ఇటీవల అభినందించారు. పర్యావరణం, భద్రత, ఆలయ నిర్వహణ, విద్యుత్ సరఫరా అంశాలకు ఐఎస్‌వో సర్టిఫికెట్‌ను పొందారు. లండన్ కేంద్రంగా ఉన్న ఐఎస్‌వో ప్రతినిధులు యాదాద్రిని సందర్శించి ఆలయంలో జరుగుతున్న నిత్యపూజలు, భక్తులకు అందుతున్న సేవలు అంశాలపై లండన్‌లోని కేంద్ర కార్యాలయానికి స్థానిక ప్రతినిధులు నివేదికలు పంపించారు. దాన్ని పరిశీలించి ప్రతినిధులు ఆలయానికి దేశంలోనే అరుదైన గౌరవం దక్కేవిధంగా ఐఎస్‌వో సర్టిఫికెట్‌ను జారీ చేశారు. యాదాద్రి అభివృద్ధికి దృఢదీక్షతో వందలకోట్ల నిధులు కేటాయించి అభివృద్ధికి చర్యలు తీసుకోవడమే కాకుండా భక్తులకు కనీస సౌకర్యాల కల్పన, అందుతున్న మౌలిక సదుపాయాలు నాణ్యమైనవిగా ఉండడంతో ఐఎస్‌వో సర్టిఫికెట్ సాధ్యమైంది. శ్రీవారి ఆలయం పక్షాన నిర్వహిస్తున్న గోశాలలో గోవులను పెంచేవిధానం, సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు కూడా బాగున్నాయని ఐఎస్‌వో బృందం అభిప్రాయపడింది. శ్రీవారికి సమర్పిం చేందుకు పెంచుతున్న గులాబీ తోటలు, నర్సరీలను వారు రెండుసార్లు సందర్శించారు. ఆలయం నిర్మాణమవుతున్న క్రమంలో భక్తులు భారీ సంఖ్యలో రావడం నిష్టతో శ్రీవారికి మొక్కులు సమర్పించు కోవడంపై పెరిగింది. అద్భుతరీతిలో ఆలయ నిర్మాణం పక్రియ సాగుతుండడాన్ని గమనించారు.




