Tuesday, 3 November 2026

వైసీపీ బంద్‌ను ప్రజలు పట్టించుకోరు

– హోదా, విభజన హావిూలపై టీడీపీ పోరాటం కొనసాగిస్తుంది
– పవన్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇద్దామనే చర్చే ఇంతవరకు పార్టీలో రాలేదు
– టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు
అమరావతి, జులై23(జ‌నంసాక్షి) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన బంద్‌ను ప్రజలు పట్టించుకోరని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళావెంకట్రావు అన్నారు. మంగళవారం వైసీపీ పిలుపిచ్చిన బంద్‌పై స్పందించిన ఆయన విూడియాతో మాట్లాడుతూ బీజేపీతో అంటకాగుతూ ¬దాపై పోరాటం అంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్‌కు రాజకీయ విధానమంటూ లేదని, ట్విట్టర్లో ఏదో ఒకటి అంటే సరిపోదని ఆయన ఎద్దేవా చేశారు. ¬దా, విభజన హావిూలపై టీడీపీ పోరాటం కొనసాగుతుందని కళావెంకట్రావు స్పష్టం చేశారు. తమపార్టీ తరఫున పవన్‌కల్యాణ్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇద్దామనే చర్చే ఇంతవరకు తమ పార్టీలో జరగలేదని కళావెంకటరావు చెప్పారు. వైసీపీ నేతలు బంద్‌ నిర్వహించి..
సాయంత్రానికి మోడీ వద్దకు వెళ్లి రిపోర్ట్‌ చేస్తారని ఎద్దేవా చేశారు. జేసీ దివాకర్‌రెడ్డి సీనియర్‌ నేత అని, పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఎప్పుడూ మాట్లాడలేదని కళా అన్నారు. ఆయన పార్టీని వీడుతారని తాను అనుకోవడం లేదని చెప్పారు.