– ప్రపంచస్థాయి స్టూడియోలు హైదరాబాద్‌లో ఉన్నాయి
– చిత్రపరిశ్రమకు హైదరాబాద్ చక్కని వేదిక
– ఐటీశాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్,నవంబర్ 20(జనంసాక్షి): యానిమేషన్, గేమింగ్‌కు చిరునామాగా తెలంగాణ మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గేమింగ్, ంటర్‌టైన్‌మెంట్ రంగంలో అతిపెద్ద ఈవెంట్‌కు హైదరాబాద్ వేదికైంది. హెచ్‌ఐసీసీలో ‘ఇండియా జాయ్’ కార్యక్రమాన్ని బుధవారం కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నటి నమ్రత, అల్లు అరవింద్, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు. నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రపంచస్థాయి స్టూడియోలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయన్నారు. చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ చక్కనివేదికగా మారిందని తెలిపారు. వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, యానిమేషన్ రంగంలో కోట్లాది రూపాయాల వ్యాపారం జరుగుతోందని, యానిమేషన్ వచ్చిన తర్వాత మూవీ మేకింగ్ మరోస్థాయికి చేరిందని కేటీఆర్ తెలిపారు. సినిమా మేకింగ్‌లో వీఎఫ్‌ఎక్స్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ‘బాహుబలి’, ‘ఈగ’, ‘మగధీర’ వంటి సినిమాలు సినిమా రంగాన్ని ఎంతో ప్రభావితం చేశాయని కేటీఆర్ తెలిపారు. 2.3 బిలియన్ ఆక్టివ్ గేమర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని, ఏడాదికి 25శాతం గేమింగ్ ఇండస్టీ వృద్ధి నమోదు చేస్తోందని అన్నారు. గేమింగ్ విభాగం నుంచి రూ.250 కోట్ల ఆదాయం ఉండగా.. ఇది 2020కి మూడు రెట్లు పెరుగుతుందని అనుకుంటున్నామని అన్నారు. ఓటీటీ బ్రాడ్‌కస్టర్ లోకల్ భాషల్లో కంటెంట్ అందిస్తోందని, చోట భీమ్ అందుకు మంచి ఉదాహరణ అని కేటీఆర్ తెలిపారు. నగరంలో రూ.1000 కోట్ల పెట్టుబడిలో ఇమేజ్ టవర్స్ ఏర్పాటు చేస్తున్నామని, 2021 లేదా 2022 లో ఇమేజ్ టవర్స్ ప్రారంభమవుతాయని మంత్రి అన్నారు.. ఏవీజీసీని విద్యార్థులకు స్జబెక్ట్‌గా అందించాలని అనుకుంటున్నామని, గేమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి సబ్సిడీలు ప్రకటించబోతున్నామని అన్నారు. ఇండియా జాయ్ ద్వారా గేమింగ్ అండ్ విూడియా సెక్టార్‌ని ప్రమోట్ చేయనున్నామని, యానిమేషన్, గేమింగ్ ఇండస్టీక్రి చక్కని డెస్టినేషన్ తెలంగాణ అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
యానిమేషన్, గేమింగ్‌కు చిరునామాగా తెలంగాణ




