Wednesday, 4 November 2026

రూట్ల ప్రైవేటీకరణ ఆపండి

– స్టే పొడిగించిన హైకోర్టు
– శుక్రవారానికి వాయిదా
హైదరాబాద్‌,నవంబర్‌ 20(జనంసాక్షి):తెలంగాణలో రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. తదుపరి చర్యలు చేపట్టవద్దని, మధ్యంతర ఉత్తర్వులను పొడిగించవద్దని ప్రభుత్వం కోరింది. ఏజీ అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం ..మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది. కేబినెట్‌ నిర్ణయంపై జీవో ఇచ్చే వరకు న్యాయ సవిూక్ష చేయరాదని ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు . సమ్మె నేపథ్యంలో రూట్ల ప్రైవేటీకరణ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు.