యాసంగి 2020-21 సీఎంఆర్‌ త్వరితగతిన పూర్తిచేయాలి

–  అదనపు  కలెక్టర్‌ వి.చంద్రశేఖర్
నల్గొండబ్యూరో. జనం సాక్షి ,
——————————
జిల్లాలో ని రైస్ మిల్లర్లు 2020-21 సంవత్సరపు యాసంగి పెండింగ్ సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) డెలివరీ జూన్ 30 లోగా పూర్తి చేయాలని  అదనపు కలెక్టర్‌ వి.చంద్ర శేఖర్ మిల్లర్ లను ఆదేశించారు.ప్రభుత్వం జూన్ 30 వరకు పొడిగించిందని,ఇంకా 6 మిల్లు లు 12000 మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్ డెలివరీ చేయాలని,జూన్ 30 లోగా పూర్తి చేయాలని అన్నారు . యాసంగి 2021-22 లో ఇప్పటి వరకు 3,26,700 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు,దాదాపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావచ్చినట్లు తెలిపారు.ఈ సమావేశం లో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు,సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానంధం తదితరులు పాల్గొన్నారు.