యువతికి మత్తుమందిచ్చి సామూహిక అత్యాచారం

గుంటూరు,జూన్‌22(జ‌నం సాక్షి ): గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. నెహ్రూనగర్‌లో యువతిపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత రాత్రి ఆటో డ్రైవర్‌ రఫీ నల్లచెరువుకు చెందిన యువతిని నెహ్రూనగర్‌ తీసుకువచ్చాడు. యువతికి మత్తు మందు ఇచ్చి ఆపై స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. తెల్లవారుజామున పూర్తి మత్తు వదిలిన తర్వాత తేరుకున్న యువతి తన జరిగిన అన్యాయంపై స్థానికుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.