యువతిని లాక్కెళ్లి రేప్‌ చేసిన ట్యాక్సీ డ్రైవర్‌

ఫిర్యాదుతో అరెస్ట్‌ చేసిన పోలీసులు

పానాజీ,జూన్‌29(జనం సాక్షి): గోవాలో దారుణం జరిగింది. ఓ టాక్సీ డ్రైవర్‌ 20 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం వాస్కో పట్టణ ఎయిర్‌పోర్టుకు 40 కిలో విూటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ యువతి వాస్కో ఎయిర్‌పోర్టు రోడ్‌ వెంబడి నడచుకుంటూ వెళ్తుంది. అటుగా వెళ్తున్న టాక్సీ డ్రైవర్‌ రవిచంద్రభట్‌ (48) లిప్ట్‌ ఇస్తానంటూ కారు ఆపి యువతికి దగ్గరకు వెళ్లాడు. అయితే యువతి తిరస్కరించింది. దీంతో రవిచంద్ర ఆ యువతిని బలవంతంగా టాక్సీలోకి లాగాడు. యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేశామని వాస్కో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నొలస్కో రపొసొ తెలిపారు. రవిచంద్ర భట్‌ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో టాక్సీ నడుపుతూ..వాస్కోలో నివాసం ఉంటున్నాడని వెల్లడించారు.