Tuesday, 3 November 2026

యువతిపై ప్రేమోన్మాది యాసిడ్‌ దాడి

– నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్‌, మే3(జ‌నం సాక్షి) : రంగారెడ్డి జిల్లా హయత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బాగ్యలత కాలనీలో యువతిపై ఓ ప్రేమోన్మాది యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. తన ప్రేమను తిరస్కరించిందన్న కారణంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. బాగ్యలత కాలనీలో నివాసం ఉండే యువతి.. హయత్‌ నగర్‌లోని ఓ పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తోంది. నిన్న రాత్రి విధులు ముగించుకుని తన స్నేహితురాలితో ఇంటికి వెళ్తుండగా ద్విచక్రవహనంపై వచ్చిన శంకర్‌ అనే యువకుడు ముందుగా యువతితో గొడవపడ్డాడు. అనంతరం తనవద్ద ఉన్న యాసిడ్‌తో దాడి చేశాడు. దీంతో యువతితోపాటు ఆమె స్నేహితురాలికి గాయాలయ్యాయి. ఘటనపై బాధితురాలు హయత్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాధితులను అసుపత్రిలో చేర్పించి.. నిందితుడు శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే గత రెండు సంవత్సరాలుగా తాము ప్రేమించుకుంటున్నామని.. కొంతకాలంగా తనను యువతి పట్టించుకోకపోవడం వల్లే ఈదాడికి పాల్పడినట్లు నిందితుడు చెప్పినట్లు సమాచారం.