యూఎస్‌ డబుల్స్‌లో సానియా జోడి విజయం

1

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి):  అంతర్జాతీయ క్రీడా వేదికపై తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ సానియా విూర్జా మరోసారి మెరిసిపోయారు. యూఎస్‌ ఓపెన్‌లో ఆమె సత్తా చాటారు. యూఎస్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌లో సానియా విూర్జా, హింగిస్‌ జోడీ విజయం సాధించింది. వరుస సెట్లలో ప్రత్యర్థిని సానియా, హింగిస్‌ జోడీ చిత్తు చేసింది. ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థులు డెలాక్వా-ష్వైదోవా జోడీపై 6-3, 6-3 తేడాతో గెలుపొందారు. దీంతో సానియా వరుసగా రెండో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ను గెలుచుకున్నైట్లెంది. సానియా ఖాతాలో ఐదో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌గా నిలిచింది.