లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బహరైచ్ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక పత్తి గోదాములో మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈఘటనలో ఆస్తినష్టం భారీగా వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.




