*యోగాతో సంపూర్ణ ఆరోగ్యం…… జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్*

*అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని  ఉట్నూర్ కెబి కాంప్లెక్స్ నందు  నిర్వహించిన యోగ కార్యక్రమంలో ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారు  ITDA PO వరుణ్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు యోగ సాధన చెయ్యాలని తద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, యోగ చెయ్యడం వల్ల భౌతికంగా మానసికంగా ప్రతి రోజు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని,పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి యోగ దివ్య సాధనంగా ఉపయోగపడుతుందని మరియు ఆరోగ్యవంతులుగా  తయారవుతారని జడ్పీ ఛైర్మన్ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ITDA స్టాఫ్ పాల్గొన్నారు.*