యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.
యోగ అనేది ఎక్సర్ సైజు కాదని అది మన మనసును,ఆత్మను,శరీరాన్ని ఏకం చేసే మహోన్నత సాధనమని యోగా టీచర్ రంజాన అన్నారు.ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నేరెడ్ మెట్ లోని హెలెన్ కెల్లర్ బధిరుల పాఠశాలలో విద్యార్థుల చేత యోగాసనాలు వేయించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.ప్రతిరోజు మన దినచర్యలో కొంత సమయం యోగాసనాలకు కేటాయిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో హెలెన్ కెల్లర్ విద్యాసంస్థల చైర్మన్ పఠాన్ ఉమర్ ఖాన్, లైన్స్ క్లబ్ హైటెక్ సిటీ జోనల్ చైర్ పర్సన్ అంజయ్య, ప్రిన్సిపాల్ ఆర్ముగం, రాజేందర్,మధుకుమార్,బిక్షపతి,గౌ