Tuesday, 3 November 2026

రంగారెడ్డిలో పాలవ్యాన్ బీభత్సం

31హైదరాబాద్: మిల్క్ వ్యాన్ శనివారం ఉదయం బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన వ్యాన్ అదుపు తప్పి బస్టాండ్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.  ఈ సంఘటన హైదరాబాద్లోని జవహర్ నగర్లో చోటు చేసుకుంది.

పాలవ్యాన్ బీభత్సంలో  ముగ్గురు మృతి

 శామీర్పేటలోని జవహర్నగర్లో శనివారం పాలవ్యాన్ బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న వ్యాన్ అదుపు తప్పి బస్స్టాప్లోకి దూసుకెళ్లింది. బస్సు కోసం వేచిన ఉన్న వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శామీర్‌పేట మండలం భాగ్యనగర్‌ కాలనీ వద్ద పాల వ్యాన్‌ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బస్సు కోసం ఎదురుచూస్తున్న10 మందిపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 నెలల బాలుడు చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *