Thursday, 5 November 2026

రంగులపూలవనంగా టాంక్‌బండ్‌

C

– ఘనంగా బతుకమ్మకు వీడ్కోలు

హైదరాబాద్‌, అక్టోబర్‌20(జనంసాక్షి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ ఉత్సవాల ముగింపు వేడుకలు మంగళవారం రాత్రి ట్యాంక్‌ బండ్‌పై ఘనంగా జరుగుతున్నాయి. ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమైన బతుకమ్మ ర్యాలీ ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. హుస్సేన్‌సాగర్‌లో తేలియాడుతున్న బతుకమ్మల బెలూన్‌లు, మహిళల బతుకమ్మ ఆటలు, కోలాటం, నృత్యాలతో సాగరతీరం రంగుల ప్రపంచంలో కనిపిస్తుంది. దీపకాంతుల మధ్య సద్దుల బతుకమ్మలను ఎత్తుకుని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, డిప్యూటీస్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డితోపాటు మహిళలు, అమ్మాయిలు, చిన్నారులు ర్యాలీగా వచ్చి ట్యాంక్‌బండ్‌ కు చేరకున్నారు. హుస్సేన్‌సాగర్‌ తీరం బతుకమ్మలు, శకటాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భాగ్యనగరమంతా పూల వనంలా శోభిల్లుతుంది. కాగా ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకాలేదు. ఫాంహౌస్‌లోనే ఉండిపోయారు. గవర్నర్‌ నరసింహన్‌ కూడా హాజరుకాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *