రమేష్ ఇంటిపై సోదాలు జరిగితే.. అధికార పార్టీకి భయమెందుకు
– చంద్రబాబు బినావిూ రమేష్ అని అర్థమవుతుంది
– జగన్‌ను విమర్శించే నైతిక హక్కు రమేష్‌కు లేదు
– విలేకరుల సమావేశంలో వైసీపీ నేత అంబటి రాంబాబు
విజయవాడ, అక్టోబర్15(జనంసాక్షి) : సీఎం రమేష్ ఇంటిపై ఐటీ సోదాలు జరిగితే అధికారపార్టీకి భయమెందుకని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఐటీ దాడులను ప్రేరేపిత దాడులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. సీఎం రమేష్ చంద్రబాబు బినావిూ అని ఆరోపించారు. వైఎస్ జగన్‌ను విమర్శించే నైతిక హక్కు రమేశ్‌కు లేదన్నారు. సీఎం రమేశ్ విూసం మెలేస్తే ఐటీ అధికారులు తొడలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. రిత్విక్ సంస్థ ఎప్పుడైనా భారీ కాంట్రాక్టు చేసిందా అని ప్రశ్నించారు. ఆ సంస్థవన్నీ సబ్ కాంట్రాక్టులేనని, అవన్నీ బెదిరించి తీసుకున్నవేనని ఆరోపించారు. ఆయన జీవిత భాగస్వామికి, కుటుంబీకులకి తెలియకుండా వేలిముద్ర ఉంటేనే తెరుచుకునే లాకర్లు ఉండటమెంటనని ప్రశ్నించారు. ఆ లాకర్లలో ఏమి దాచారో చెప్పాలన్నారు. సీఎం రమేశ్ ఓ గజదొంగ, బినావిూ, బ్రోకర్ కాబట్టే అలాంటి లాకర్లు ఇంట్లో పెట్టుకున్నారని విమర్శించారు. ఇవన్ని చేస్తూ విూసం మెలేస్తున్నాడని.. పచ్చకాలం అంటే ఇదేనని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ నాలుగేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు,తేడా ఎక్కడ వచ్చిందో విడిపోయారని విమర్శించారు. సీఎం రమేశ్ సారా కాంట్రక్టర్ దశ నుంచి ఎంపీ స్థాయికి రావడానికి గెస్ట్‌హౌజ్ రాజకీయాలే కారణమని ఆరోపించారు. పచ్చకాలం ఎక్కువ కాలం ఉండదని, ప్రజలు బుద్ది చెప్పే రోజులు ముందున్నాయని అంబటి పేర్కొన్నారు.