విూనా ఎన్‌కౌంటర్‌ బూటకం

– అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నా హతమార్చారు
– ఎన్‌కౌంటర్‌పై పెదవి విప్పిన మావోయిస్టులు
విశాఖపట్టణం, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ఇటీవల జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు స్పందించారు. ఈ మేరకు వారి ప్రతినిధి కైలాసం ఆడియో టేపు విడుదల చేశారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు మావోయిస్టులను చుట్టుముట్టి విూనాను అతి సవిూపం
నుంచి కాల్చి చంపారని కైలాసం ఆరోపించారు. కాల్పుల్లో గాయపడిన విూనాను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయకుండా చంపేశారని అన్నారు. విూనా మృతి మావోయిస్టులకు తీరని లోటని అన్నారు. ఐవోబీలో గల ఆండ్రాపల్లి, జోడాంబో, పనసపుట్టు తదితర ప్రాంతాల్లో బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఓజీ బలగాలు గిరిజనులను చిత్రహింసలు పెడుతున్నాయని, వారిపై మావోయిస్టు ముద్ర వేస్తున్నాయని కైలాసం ఆరోపించారు. కటాఫ్‌ ఏరియాలోని వివిధ మండలాల్లో ఈ దారుణాలు కొనసాగుతున్నాయన్నారు. బంధువుల ఇంటికి వచ్చిన వారిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని మావోయిస్టులుగా చిత్రీకరించారని మండిపడ్డారు. పోలీసుల అరాచకాలను అడ్డుకున్న గిరిజనులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారన్నారు. ఇలాంటి చర్యలకు పోలీసులు పాల్పడటం మంచి పద్దతి కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజావార్తలు